Community
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (C.P.I)
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (C.P.I)

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (C.P.I)

14 Members
Bunny  
1 y ·Translate · points 255

కార్మికుల సమస్యల పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన ఉదృతం చేస్తామని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు

ఆటో కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సీఎం కార్యాలయానికి ముట్టడికి మంగళవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ అనుబంధ సంస్థ అయినా (ఆటో వర్కర్స్ యూనియన్) సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా సీఎం కార్యాలయాన్ని ముట్టడికి వెళ్తారనే ఏఐటీయూసీ, నాయకులు జిల్లా కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్, సీపీఐ నాయకులు నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నందం బ్రహ్మేశ్వర రావు,లను ముందస్తుగా చర్యల్లో భాగంగా పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆటో కార్మిక సంక్షేమ సంఘం బోర్డు ఏర్పాటు చేయమంటే నాయకులను అరెస్ట్ చేయడం దుర్మార్గమని రాష్ట్రంలో ప్రజాస్వామిక వ్యవస్థ నడుస్తుందని. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్ మండిపడ్డారు.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్ మాట్లాడుతూ ఏఐటీయూసీ అనుబంధ సంస్థ అయిన ఆటో కార్మిక సంఘం నాయకులు ఆటో కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయుటకు ఎన్నికల్లో హామీ ఇచ్చి కాలం గడుపుకుంటూ వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలను గాలికి వదిలేసి బట్టలను నొక్కుతూ కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. సీఎం కార్యాలయానికి ముట్టడికి పిలుపునిస్తే నాయకులను అక్రమ అరెస్టులు చేస్తూ గృహనిర్బంధాలకు గురి చేస్తూ అనేక ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. అప్రాజస్వామికంగా జీవోలు తెచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారని జీవోలు రద్దుచేసి ఆటో వర్కర్స్ కి న్యాయం చేయాలని అన్నారు. కేంద్రంలో ఉన్న మోడీ ఏది చెబితే అది చేస్తూ కార్మికులను ఎన్నో ఇబ్బందులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నందం బ్రహ్మేశ్వర రావు లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సమస్యల మీద దృష్టి పెట్టకుండా. కార్మికులను నానా ఇబ్బందులకు గురి చేస్తూ బడా కార్పొరేటర్లకు మాత్రం రాష్ట్ర సంపాదన మొత్తం దోచిపెడుతుందని మండిపడ్డారు. సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయమంటే రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తూ కార్మిక సమస్యలను పట్టించుకోకుండా ఆటో కేసులు రాస్తూ డీజిల్ రేటు పెట్రోల్ రేటు పెంచి ఆటోలు అద్దెకి తీసుకొని అద్దెలు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నారని. ఆటో కార్మిక సంఘం సంక్షేమ బోర్డు ఏర్పాటు ద్వారా వాళ్లకి ఎంతో కొంత లబ్ధి చేకూరుతుందని ఉద్దేశంతో సమస్యల పరిష్కరించాలని కోరుతూ ఉంటే అక్రమ అరెస్టులు చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని మండిపడ్డారు.

image
Bunny  
1 y ·Translate · points 255

మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద టిడిపి చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం తెలిపిన సిపిఐ, సిపిఎం, నాయకులు.
#todaynews

image
Bunny  
1 y ·Translate · points 255

చంద్రబాబుని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని తప్పుడు ఆలోచనలతోనే అరెస్టు

ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా జరిగిన ఈ అరెస్టును సిపిఐ పార్టీగా ఖండిస్తున్నాం

తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని సవరించుకోవాలని కోరుతున్నాం

రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయని అన్నారు.

రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వార్యం చేసి ప్రజా కంటక చర్యలకు పాలకపక్షం ఒడిగడుతుందిదని ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపుతో కేసులు అరెస్టులతో వేధింపులకు పాల్పడుతుందని ఈ ఆప్రజాస్వామిక చర్యలను సిపిఐ ఎప్పుడు నిరసిస్తూనే ఉంటుందని. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ అన్నారు. సోమవారం మంగళగిరిలోనే పట్టణ, రూరల్, పోలీస్ స్టేషన్లలో ఆ ప్రజాస్వామిక పద్ధతిలో తెలుగుదేశం పార్టీ అధినేత తమ ప్రియతమ నాయకుడిని రిమాండ్కు విధించడం ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులు తమ నిరసనలు తెలియజేస్తుంటే హౌస్ అరెస్టులు, పోలీస్ స్టేషన్లకు తరలించడానికి ఖండిస్తూ వారికి సంఘీభావంగా మద్దతు తెలియజేయడానికి మంగళగిరి పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్ లకు వచ్చి సంఘీభావం మద్దతు తెలియజేసి మాట్లాడుతున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని హడావుడిగా అరెస్టు చేసి రిమాండ్కు పంపించడం. రాష్ట్రంలో భయభ్రాంతులకు గురిచేసి ఆందోళనలు, సృష్టించడానికి రాక్షస పద్ధతుల్లో వైసిపి ప్రభుత్వం దుర్మార్గంగా అరెస్టు చేసి శాస్త్రీయత లేని పద్ధతిలో నిన్న రిమాండ్ కి పంపడం అనేది జరిగింది. ఇవాళ పోలీసు వ్యవస్థలు, సిఐడి దారుణమైన పద్ధతుల్లో ప్రజాస్వామికమైన పద్ధతిలో వ్యవహరించడం అనేది కచ్చితంగా కనబడుతుంది ఇన్నాళ్లు బట్టి నాలుగు సంవత్సరాలుగా ఈ స్కిల్ డెవలప్మెంట్ అనే దానిమీద అడపాదడపా స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు ఇచ్చి ఏ రకమైనటువంటి మాట కూడా నోట మట రాకుండా వైసిపి వాళ్ళు పోలీస్ వాళ్ళు సిబిఐ వాళ్ళు సిఐడి వాళ్లు వీళ్ళందరూ ఈ రోజున హఠాత్తుగా స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ప్రపంచంలో అందరికంటే పెద్ద అవినీతి జరిగిపోయింది అందుకని వెంటనే రిమాండ్కు పంపిస్తున్నామని చెప్పి రిమాండ్ కి పంపించడం అనేది చూస్తా ఉన్నాం దీనిమీద ఇంకా చాలా ఉన్నాయని బ్లాక్మెయిల్ చేసే పద్ధతిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి జైలు కెళ్ళాడు కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్షంలో ఉండి జైలుకి వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని జైలుకు పంపించాలనేటువంటి పైశాచిక ఆనందం తప్ప ఇది నిలబడే కేసు కాదని స్పష్టంగా తెలియజేస్తున్నాం ఇవ్వాలా చంద్రబాబు నాయుడుని బేషరతుగా విడుదల చేయాలని చెప్పి అలాగే అక్రమ కేసులు పెట్టడం ద్వారా కార్యకర్తలను నాయకులు మీరేదో సాధించాలి అనుకుంటే వైసీపీ వారి బ్రహ్మా అని సిపిఐగా తెలియజేస్తూ ఈ రోజున జరిగినటువంటి. ఈ రాక్షస సంఘటనని సిపిఐ గా ఖండిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ చేసినటువంటి బంద్ కి సంపూర్ణతమైనటువంటి మా నైతిక మద్దతుని వారికి తెలియజేస్తున్నాం. ఈరోజు జరిగినటువంటి ముందస్తు అరెస్టులను కూడా మేము ప్రజాస్వామ్యంలో, నిరసన వ్యక్తం చేసే హక్కు అని అడుగుతున్నాం. వారి అధినాయకుడిని అరెస్ట్ చేస్తే రోడ్డు మీదకు వచ్చి హరించే పద్ధతిలో గుంటూరులో అలాగే మంగళగిరిలో, రాష్ట్ర వ్యాప్తంగా అన్నిచోట్ల ఇలా హౌస్ అరెస్టులు, అరెస్టు చేసి మూకుమ్మడిగా పోలీస్ స్టేషన్లో తీసుకురావటం తీవ్రంగా ఖండిస్తూ బంద్ కి సిపిఐ పార్టీగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం
సిపిఐనియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో జరుగుతున్న దమనకాండ ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా జరుగుతున్న అరెస్టులను ఖండించాలని అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా జరిగిన ఈ అరెస్టును సిపిఐ పార్టీగా ఖండిస్తున్నామని అంతేకాకుండా రాష్ట్రంలో అలజడులు సృష్టించటానికి వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని అన్నారు. రాజకీయ కక్ష సాధింపునకు ఇది నిదర్శనం అని నియంత పాలనపై, ప్రతిపక్షాలన్నీ ప్రజా సంఘాలు అన్నీ కలిపి పోరాటం చేయాలని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంటి వారినే వేధిస్తుంటే ఇక సామాన్యుడు పరిస్థితి ఏమిటి అని ప్రజలే ఆలోచించుకోవాలని అన్నారు. ప్రజలందరూ మేల్కొలవలసిన సమయం ఆసన్నమైందని వైసీపీ ప్రభుత్వం శాంతి భద్రతల సమస్యలను మండిపడ్డారు. సంఘీభావం తెలిపిన వారిలో యార్లగడ్డ వెంకటేశ్వరరావు, జాలాది జాన్ బాబు, బుర్ల శ్రీనివాసరావు, గుర్రంకొండ సత్యానందం, మత్తే అభిషేక్, ఆళ్ళమూడి హనోక్ బాబు, పోలీస్ స్టేషన్లకు తరలించిన వారిలో జవ్వాది కిరణ్ చంద్, దామర్ల రాజు, తోట పార్థసారథి, ఆకుల ఉమామహేశ్వరరావు, గోవాడ దుర్గారావు, షేక్ రియాజ్, ఆరుద్ర భూలక్ష్మి, వేమూరి మైనర్ బాబు, వెంకట్, ఎర్రగుంట్ల భాగ్య రావు, పార్టీ నాయకులను కార్యకర్తలను పోలీస్ స్టేషన్కు తరలించారు.

image