కార్మికుల సమస్యల పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన ఉదృతం చేస్తామని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు
ఆటో కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సీఎం కార్యాలయానికి ముట్టడికి మంగళవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ అనుబంధ సంస్థ అయినా (ఆటో వర్కర్స్ యూనియన్) సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా సీఎం కార్యాలయాన్ని ముట్టడికి వెళ్తారనే ఏఐటీయూసీ, నాయకులు జిల్లా కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్, సీపీఐ నాయకులు నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నందం బ్రహ్మేశ్వర రావు,లను ముందస్తుగా చర్యల్లో భాగంగా పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆటో కార్మిక సంక్షేమ సంఘం బోర్డు ఏర్పాటు చేయమంటే నాయకులను అరెస్ట్ చేయడం దుర్మార్గమని రాష్ట్రంలో ప్రజాస్వామిక వ్యవస్థ నడుస్తుందని. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్ మండిపడ్డారు.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్ మాట్లాడుతూ ఏఐటీయూసీ అనుబంధ సంస్థ అయిన ఆటో కార్మిక సంఘం నాయకులు ఆటో కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయుటకు ఎన్నికల్లో హామీ ఇచ్చి కాలం గడుపుకుంటూ వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలను గాలికి వదిలేసి బట్టలను నొక్కుతూ కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. సీఎం కార్యాలయానికి ముట్టడికి పిలుపునిస్తే నాయకులను అక్రమ అరెస్టులు చేస్తూ గృహనిర్బంధాలకు గురి చేస్తూ అనేక ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. అప్రాజస్వామికంగా జీవోలు తెచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారని జీవోలు రద్దుచేసి ఆటో వర్కర్స్ కి న్యాయం చేయాలని అన్నారు. కేంద్రంలో ఉన్న మోడీ ఏది చెబితే అది చేస్తూ కార్మికులను ఎన్నో ఇబ్బందులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నందం బ్రహ్మేశ్వర రావు లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సమస్యల మీద దృష్టి పెట్టకుండా. కార్మికులను నానా ఇబ్బందులకు గురి చేస్తూ బడా కార్పొరేటర్లకు మాత్రం రాష్ట్ర సంపాదన మొత్తం దోచిపెడుతుందని మండిపడ్డారు. సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయమంటే రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తూ కార్మిక సమస్యలను పట్టించుకోకుండా ఆటో కేసులు రాస్తూ డీజిల్ రేటు పెట్రోల్ రేటు పెంచి ఆటోలు అద్దెకి తీసుకొని అద్దెలు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నారని. ఆటో కార్మిక సంఘం సంక్షేమ బోర్డు ఏర్పాటు ద్వారా వాళ్లకి ఎంతో కొంత లబ్ధి చేకూరుతుందని ఉద్దేశంతో సమస్యల పరిష్కరించాలని కోరుతూ ఉంటే అక్రమ అరెస్టులు చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని మండిపడ్డారు.